
ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి
పుట్టపర్తి టౌన్: రెస్టారెంట్లు, హోటళ్లలో యజమానులు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్రయ్య సూచించారు. గురువారం పుట్టపర్తి మున్సిపాలిటీలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మున్సిపాలిటీ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల యమానులు పరిశభ్రత పాటిస్తూ తిను బండారాలపై దృష్టి సారించాలన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పుట్టపర్తి విచ్చేయనున్నారని, వారికి ఇబ్బంది కలగకుండా సరసమై ధరలతో,నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.