
మానవాళి మహానేస్తాలు చిత్రం ఆవిష్కరణ
ధర్మవరం అర్బన్: సమాజాభివృద్ధికి కొత్త బాటలు వేసిన 102 మంది ప్రపంచ మేధావులతో కూడిన చిత్రపటాన్ని ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని మేలుకొల్పేవారే నిజమైన వైతాళికులన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆల్బర్ట్ ఐన్‌స్టిన్, మహాత్మాగాంధీ, విలియం షేక్‌స్పియర్, మదర్‌థెరిస్సా, ఆల్బర్ట్ నోబెల్, విన్స్టన్ చర్చిల్, నెపోలియన్, రవీంద్రనాథ్ ఠాగూర్, కారల్ మార్క్స్, కన్ఫ్యూషియస్, లెనిన్, పికాసో, కోఫీఅన్నన్ వంటి పేరు గాంచిన కవులు, రచయితలు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సామాజిక, శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక, తత్వ రాజకీయ, క్రీడా, వ్యాపార, ఆర్థిక విద్యావేత్తలతో కూడిన 102 మంది మేధావుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ, అధ్యాపకులు త్రివేణి, షమీవుల్లా, పావని, హైమావతి, వెంకటలక్ష్మి, తాహిర్‌ఆలి, ఆనంద్, మీన, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
డి.చెర్లోపల్లిలో పర్యటించిన కేంద్ర బృందం
బత్తలపల్లి: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌లో భాగంగా కేంద్ర బృందం సభ్యులు గురువారం బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలో పర్యటించారు.ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మసీదు, గ్రామ సచివాలయం, చెత్తతో సంపద తయారీ కేంద్రంతో పాటు గ్రామంలోని గృహాలు, మరుగుదొడ్లను, నీటివసతి, పరిసరాలు పరిశుభ్రతను, మురుగునీటి నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యుడు బి.రామచంద్ర, జిల్లా ఎస్‌బీఎం కోఆర్డినేటర్లు వి.శ్రీనివాసులు, డి.సాయినాథ్‌బాబు, మండల అధికారులు ఎంపీడీఓ నరసింహనాయుడు, ఈఓఆర్డీ క్రిష్టప్ప, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జ్యోతిబాయి, గ్రామ సర్పంచ్ గుజ్జల రమాదేవి, పంచాయతీ కార్యదర్శి నారాయణస్వామి, ఎంసీఓ ఆదినారాయణరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
● సీటీఐఓ లక్ష్మానాయక్
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎఫ్) చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఐఓ) వి.లక్ష్మానాయక్ అన్నారు. స్థానిక జెడ్‌బీఎన్‌ఎఫ్ కార్యాలయంలో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన డీపీఎంయూ సిబ్బందికి 8 రోజుల వర్క్‌షాపు గురువారం ప్రారంభమైంది. నేలలు, రకాలు, ఆగ్రో క్‌లైమాటిక్ జోన్స్, జలవనరులు, ప్రాజెక్టులు, రైతుల అవసరాలు, ప్రకృతి వ్యవసాయ ఆవిష్కరణలు, ఏటీఎం, ఏ–గ్రేడు, పీఎండీఎస్, డాక్టర్ పీఎం, రుతుపవనాలు, వర్షపాతం, తేమశాతం, నేలల్లో తేమ సంరక్షణా విధానం, మానవులు, పశువుల మధ్య వ్యవసాయ సంబంధాలు తదితర అంశాలపై ఈనెల 24 వరకు వర్క్‌షాపు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా లక్ష్మానాయక్ మాట్లాడారు. సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. విచ్చలవిడి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల అధిక పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు కారణంగా రైతులకు వ్యవసాయం భారమవుతున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడమే శరణ్యమన్నారు. ఏడాది పొడవునా పంటలు పండించే పద్ధతులు తెలియజేయాలన్నారు.

మానవాళి మహానేస్తాలు చిత్రం ఆవిష్కరణ