
జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై ప
ఇసుక ట్రాక్టర్ ఢీ.. విద్యార్థి మృతి
● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
పరిగి: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం మండలంలోని శాసనకోట సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పరిగి మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన రుతుపూర్ణ చక్రవర్తి, గంగాదేవి దంపతుల ఏకై క కుమారుడు అఖిల్‌కుమార్(17) హిందూపురంలోని ఓ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ద్విచక్రవాహనంలో కళాశాలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తన మిత్రుడు లోకేష్‌తో కలిసి స్వగ్రామం ఊటుకూరుకు బయలుదేరాడు. నేతులపల్లి సమీపంలోని రాగానే పెన్నా, జయమంగళీ నదుల సంగమ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టరు వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న అఖిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు లోకేష్‌ను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అఖిల్‌కుమార్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రాక్టరు, డ్రైవరు ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నేడు పుట్టపర్తికి
మహిళా కమిషన్ చైర్‌పర్సన్
ప్రశాంతి నిలయం: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ గురువారం పుట్టపర్తి రానున్నారు. ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని సాయిఆరామంలో నిర్వహించనున్న మహిళా సంక్షేమం, భద్రత సదస్సులో ఆమె పాల్గొంటారని డీపీఆర్‌ఓ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం అనంతరం సాయిఆరామంలోనే ఆమె విలేకరులతో మాట్లాడతారని పేర్కొన్నారు.

జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై ప