
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
చిలమత్తూరు: మండలంలోని టేకులోడు క్రాస్ వద్ద 544ఈ జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో గోరంట్ల మండలం గౌనిపల్లికి చెందిన అంజినప్ప (70) అక్కడికక్కడే మృతిచెందాడు. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శివకుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు.
బాలుడి దుర్మరణం
సోమందేపల్లి: మండలంలోని వెలుగుమాకులపల్లి గ్రామ సమీపంలో బస్సును ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురం మండలం బాలంపల్లికి చెందిన రాజురెడ్డి కుమారుడు నరేష్‌రెడ్డి(14) రాచూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ద్విచక్ర వాహనంపై పాలసముద్రం వైపు వెళుతూ వెలుగుమాకులపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.