
కూటమి అసలు రంగు బట్టబయలైంది
‘సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి’ అని వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు మాటలతో కూటమి అసలు రంగు బయటపడింది. చంద్రబాబు డైరెక్షన్‌లో రాజకీయం చేసే కూటమి నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారు. అందుకే వారి అబద్ధపు హామీలు నమ్మొద్దని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. అదే ఇప్పుడు నిజమైంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో కూటమి సర్కార్ ఆడబిడ్డలను మోసం చేసిందని అర్థం అయిపోయింది.
– టీఎన్ దీపిక, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, హిందూపురం