
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆక
రాజకీయ కుట్రతోనే
మిథున్ రెడ్డి అరెస్ట్
సాక్షి పుట్టపర్తి: ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కుట్ర పూరితమైందని ఎమ్మెల్సీ మంగమ్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. లేని మద్యం కేసును వైఎస్సార్ సీపీ నాయకులకు అంటగడుతున్నారన్నారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల వేల అలివిగాని హమీలు గుప్పించిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక హామీల అమలు పక్కన పెట్టి...ప్రశ్నించిన వారిపై కక్ష గడుతోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ కేడర్‌ను అణచి వేయడంపైనే కూటమి ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోందనన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులెవరూ భయపడబోరన్నారు. రానున్న రోజుల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రజలకోసం పోరాడుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పక ఎండగడుతుందని మంగమ్మ అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
గొట్లూరు విద్యార్థులు
ధర్మవరం రూరల్: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్, జూనియర్స్ పోటీలకు గొట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. సబ్ జూనియర్ జట్టుకు సాయి జోష్నవి, జయవర్ధన్, జూనియర్ జట్టుకు వినయ్, కమలాక్షి ఎంపికై నట్లు పీడీ రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు జగన్నాథం, ఉపాధ్యాయులు అభినందించారు.

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆక