
భక్తిశ్రద్ధలతో జలధికి పీర్లు
పుట్టపర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాల్లో మంగళవారం పీర్ల జలధి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయమే గుండం వద్ద పొట్టేళ్లను బలిచ్చారు. సాయంత్రం ఉల్లాసంగా అలావ్ తొక్కారు. అనంతరం చావిడి ముందున్న గుండం చుట్లూ పీర్ల స్వాములను ప్రదక్షిణలు చేయించి అగ్ని ప్రవేశం చేయించారు. అగ్ని గుండంలోకి భక్తులు కొబ్బరి గిన్నెలు, బెల్లం వేశారు. హిందువులు, ముస్లింలు చక్కెర చదివించారు. అనంతరం అగ్నిగుండం పూడ్చివేసి పీర్లను జలధికి తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సునీత బందోబస్తు చేపట్టారు.