
డాక్యుమెంట్లు సరి చూసుకోవాలి
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను జిల్లాలు కొని ఇక్కడకు తెచ్చుకుంటున్నారు. అయితే ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వాహనం ఏపీలో తిప్పాలంటే మళ్లీ మన వద్ద ట్యాక్స్ కడితే ఏపీ రిజిస్ట్రేషన్ చేస్తాం. అలాగే ఒక రాష్ట్రంలో నమోదైన వాహనాలను మరో రాష్ట్రానికి తరలించేందుకు తప్పనిసరిగా రవాణా శాఖ అనుమతి అవసరం. రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, వాహన యజమాని చిరునామా ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. ఎన్‌ఓసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఉన్న వాటిని ఎక్కడైనా విక్రయించవచ్చు. అయితే కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి.
– ఎన్‌ఎన్ కరుణసాగర్‌రెడ్డి,
జిల్లా రవాణా శాఖాధికారి
●