
అప్పుల సంగతి అప్పుడు తెలియదా ?.
అధికారం కోసం అలవిగాని హామీలిచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల సంగతి కూటమి నాయకులకు తెలియదా..? ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని అమ్మేయాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. ఎన్నికల వేళ ఆడబిడ్డలందరికీ అన్ని పథకాలు అందిస్తామని పలికిన నేతలు, అధికారం చేపట్టగానే అమలు చెయ్యలేమని బహిరంగంగా చెప్పడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకున్నా.. ఏడాదికే రూ.లక్ష కోట్లపైబడి అప్పులు ఎందుకు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరో నాలుగు ఏళ్ల కూటమి పాలన పూర్తి కావాలంటే, రాష్ట్ర ప్రజలపై ఎన్ని రూ.లక్షల కోట్ల అప్పు మోపుతారో తెలియడం లేదు. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ