
ఖరీఫ్ సాగు.. డీలా
పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ సాగు ముందుకు సాగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే మంచి ఆదను మించిపోవడంతో వేరుశనగ, కంది సాగు చేసే పరిస్థితి లేదు. బోర్లు ఉన్న రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పశువులు, జీవాలకు మేత దొరకడం కూడా కష్టంగా మారింది. గత ఐదేళ్ల సాగు గణాంకాలు పరిశీలిస్తే ఏటా సాధారణంగా 2,19,950 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాదిలో ఈ నెల ఐదో తేదీ వరకు వరకు ,15,333 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వేరుశనగ 10,365 హెక్టార్లు, మొక్కజొన్న 1,696, కంది 1,614, పత్తి 1,208, రాగి 267, ఆముదం 53, వరి 54, సజ్జ 50, జొన్న 26 హెక్టార్లలో వేశారు. మొదటి తర్వాత నుంచి జల్లులు కురుస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. దీంతో రెండు లక్షల హెక్టార్లకు పైగా భూమి బీడుగా పెట్టారు. ఇలా అయితే వ్యవసాయం చేసేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రెండు లక్షల హెక్టార్లు బీడు
వర్షాభావంతో సన్నగిల్లిన ఆశలు
పశువులకు మేత కూడా గగనమే

ఖరీఫ్ సాగు.. డీలా