
అసభ్య ప్రవర్తన, దాడి కేసులో నిందితుడి అరెస్ట్
కొత్తచెరువు: అసభ్యకర ప్రవర్తన, మహిళలపై దాడి ఘటన కేసులో నిందితుడైన మండల కేంద్రం కొత్తచెరువుకు చెందిన శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మారుతీ శంకర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 11న ఓ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అడ్డు చెప్పబోయిన ఆమె తల్లిపై విచక్షణారహితంగా కాలనీలో అందరూ చూస్తుండగా దాడి చేశాడు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు 15న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడు శ్రీనివాసులును పోలీసులు శనివారం అతని ఇంటివద్దనే అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. సీ్త్రలు, పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దౌర్జన్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.