వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

Jul 21 2025 5:49 AM | Updated on Jul 21 2025 1:18 PM

పుట్టపర్తి టౌన్‌: వైఎస్సార్‌సీపీ కమిటీలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు దక్కింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం పార్లమెంట్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కె.రమేష్‌రెడ్డి, నిట్టూరు రఘునాథ్‌రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో రాష్ట్ర కార్యదర్శులుగా ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, బోయ తిప్పేస్వామి నియమితులయ్యారు. 

పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించనున్నారని, వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్‌ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పాత వాహనాల వేలానికి ఏర్పాట్లు

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ ఆవరణలో ఉంచిన పాత వాహనాలను వేలం వేసేందుకు మోక్షం కలిగింది. ఈ నెల 7న ‘ఇతరులకు చెబుతాం... ఆచరించం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. పాత వాహనాలు వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టరేట్‌ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి వాహనాలను ఒక క్రమంలో ఏర్పాటు చేయించారు. వాటి విలువ నిర్ధారించేందుకు ఆర్టీఏ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. ఇదిలా ఉండగా వాహనాల స్థితిని పరిశీలిస్తే అవి గుజిరీకి తప్ప మరెందుకూ పనికిరావని పలువురు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేటి నుంచి మస్తానయ్య ఉరుసు

గుంతకల్లు: పాతగుంతకల్లులో వెలిసిన హజరత్‌ సయ్యద్‌ మస్తాన్‌వలి స్వామి 390వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమవుతాయని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ రహీం తెలిపారు. కులమతాలకు అతీతంగా మూడు రోజులు పాటు జరిగే ఈ ఉరుసు ఉత్సవాలకు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. భక్తుల కోసం తాగునీరు, తాత్కాలిక టాయిలెట్లు, దర్గా ఖాళీ ప్రదేశాల్లో షామియానాలు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 

మున్సిపల్‌ అధికారుల సహాయంతో నీటి ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. తొలిరోజు ఆదివారం గంధం మహోత్సవం, సోమవారం షంషీర్‌ (ఉరుసు ఉత్సవం), మంగళవారం జియారత్‌ కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. దర్గా ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న ఆర్చ్‌లతో పాటు దర్గా ప్రాంగణాలు విద్యుత్‌ దీపాలతో అందంగా అలకరించామని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా నీడలో వందలాది మంది పోలీసులుచే భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 1
1/3

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 2
2/3

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 3
3/3

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement