
అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారుల
బత్తలపల్లి: అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది చేస్తూ తమ అధికారాలను ప్రభుత్వాధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు చల్లా శ్రీరాములుకు చెందిన భూమి కోర్టు పరిధిలో ఉన్నా.. లెక్క చేయకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమంగా కంచె తొలగించిన విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలో అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించి తమ అధికారాలను వారు దుర్వినియోగం చేశారన్నారు. రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధిత రైతుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేతిరెడ్డి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి, మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి, నాయకులు చల్లా కృష్ణమనాయుడు, చల్లా శ్రీరాములు, చల్లా మహేష్, చల్లా రంగానాయుడు, కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ షరాబ్ యోగానంద ఆచారి, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
అధికారులు తొలగించిన కంచెను పరిశీలిస్తున్న
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి