
మార్కెటింగ్ కల్పించాలి
అన్‌సీజన్ కారణంగా పట్టుచీరల అమ్మకాలు బాగా తగ్గాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా షోరూం నిర్వాహకులు ఆషాఢం డిస్కౌంట్ ఇవ్వాలంటున్నారు. దీంతో మేం నష్టపోతున్నాం. ప్రభుత్వం పట్టుచీరల వ్యాపారులకు సొసైటీల ద్వారా అన్‌సీజన్‌లో పట్టు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. అలాగే పరిశ్రమల శాఖ నుంచి రాయితీ రుణాలను అందివ్వాలి. చేనేత కార్మికులకు ముడిపట్టురాయితీలు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పట్టుచీరల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
– రంగన శ్రీనివాసులు,
పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం.
తీవ్రంగా నష్టపోతున్నాం
ఆషాఢం ఎఫెక్ట్ పట్టుచీరల వ్యాపారంపై తీవ్రంగా చూపుతోంది. ఇప్పటికే చేనేత సంక్షోభం కారణంగా పట్టుచీరల ఉత్పత్తి తగ్గింది. అన్‌సీజన్ కారణంగా రూ.లక్షల పెట్టుబడి స్తంభించిపోతోంది. ఆషాఢం డిస్కౌంట్ సేల్స్, అన్‌సీజన్ పట్టుచీరల వ్యాపారులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– నరేంద్ర, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం.

మార్కెటింగ్ కల్పించాలి