
స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌పై మంత్రి సమీక్ష
ధర్మవరం అర్బన్: స్థానిక నియోజకవర్గ పరిధిలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గురువారం సమీక్షించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ ప్రక్రియలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ సాయి మనోహర్, విద్యావేత్త సురేంద్రనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర సామాజిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్క రంగంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
బ్లాక్ స్పాట్ల పరిశీలన
ధర్మవరం అర్బన్: ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్ మరింత నిఘా ఉంచాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాణి, సిబ్బందికి జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ బి.కృష్ణవేణి సూచించారు. ధర్మవరంలోని ఆర్‌టీఓ కార్యాలయాన్ని గురువారం జేటీసీ సందర్శించారు. పట్టణంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఎంవీఐతో సమావేశమై మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌పై మంత్రి సమీక్ష