
పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్
నల్లమాడ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన యువకుడు పోతులయ్య నల్లమాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల వయసున్న బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. మాయ మాటలతో అత్యాచారం సాగించాడు. విషయాన్ని బాలిక ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోతులయ్యపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.