వైకల్య పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు
బత్తలపల్లి: వంద శాతం వైకల్యమున్న వారు సైతం తిరిగి పరీక్షలకు హాజరు కావాలంటూ దివ్యాంగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విడతల వారీగా 50 మందికి పరీక్షలకు హాజరు కావాలని మండల వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న పలువురు దివ్యాంగులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి బుధవారం చేరుకున్నారు. పరీక్షల పేరుతో దివ్యాంగ పింఛన్ల లబ్ధిదారులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఈ సందర్భంగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
రైలు ఎక్కబోతు కిందపడి వృద్ధురాలి మృతి
ముదిగుబ్బ: మండలంలోని మలకవేమల రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి ఓ వృద్ధురాలు స్యాసింజర్ రైలు ఎక్కబోతూ అదుపు తప్పి కింద పడి మృతి చెందింది. మృతురాలిని ధర్మవరంలోని యర్రగుంటకు చెందిన నారాయణమ్మ (80)గా గుర్తించినట్లు జీఆర్పీ ఎస్‌ఐ రహీం తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బత్తలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను బుధవారం బత్తలపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గరిశలపల్లి పరిసర ప్రాంతంలోని చిత్రావతి నది నుంచి రామాపురం గ్రామానికి చెందిన వీరనారప్ప ఇసుకను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించారు.
వైకల్య పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు
వైకల్య పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు


