
వైభవంగా మల్లెపూల ఉత్సవం
కదిరి టౌన్: వైశాఖ శుద్ద పౌర్ణమిని పురస్కరించుకుని కదిరిలోని మద్దిలేరు ఒడ్డున ఉన్న మల్లెపూల మంటపం వద్ద సోమవారం సాయంత్రం శ్రీవారి మల్లెపూల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు మల్లెపూల మంటపం వద్దకు స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో చేర్చారు. అనంతరంశ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుడి ఉత్సవమూర్తులను మల్లెపూలతో ప్రత్యేక అలంకరించారు. ఉభయదారులుగా కదిరికి చెందిన మల్లెపూల నరసయ్య కుమారులు వ్యవహరించారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.