
వీర జవాన్ కుటుంబానికి అండగా ఉంటాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: యుద్ధ భూమిలో శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతూ మురళీ నాయక్ మృత్యుఒడికి చేరడం బాధాకరమన్నారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని చెప్పారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.