
వీరుడా... విజయోస్తు!
● దేశం కోసం యుద్ధ భూమికి..
కనగానపల్లి: దేశం కోసం ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని యుద్ధభూమికి సాగనంపారు. కుర్లపల్లి తండాకు చెందిన రేఖేనాయక్ బిహార్ సమీపంలోని దేశ సరిహద్దులో ఎస్‌ఎస్‌బీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం 15 రోజులు సెలవులు పెట్టి ఈ మధ్యనే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలోనే భారత్– పాకిస్తాన్ యుద్ధం రావటంతో సెలవులు రద్దు చేసుకొని విధుల్లో చేరాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో శనివారం ఆ యువకుడు తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకొని యుద్ధ భూమికి బయలుదేరాడు. తల్లిదండ్రులు భీమ్లా నాయక్, నాగలక్ష్మి మాట్లాడుతూ దేశం కోసం కన్నప్రేమను కూడా కాదనుకొని తమ బిడ్డను యుద్ధానికి పంపుతున్నామన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం మా బిడ్డ యుద్ధ భూమికి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఇసుకతిన్నెలు పడి
రైతు మృతి
ఓడీచెరువు : ఇసుకతిన్నెలు పడి రైతు మృతి చెందాడు. దిగువపల్లికి చెందిన జెరిపిటి లక్ష్మీనారాయణ (65) అనే రైతు ఇసుక కోసం శనివారం గ్రామ శివారులోని ఏటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇసుక తవ్వుతుండగా ఉన్నపళంగా తిన్నెలు విరిగిపడటంతో లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆయన్ని ద్విచక్రవాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

వీరుడా... విజయోస్తు!

వీరుడా... విజయోస్తు!