
ఆత్మస్థైర్యం పెరిగింది
స్వతహాగా నేను చాలా భయస్తురాలిని. అమ్మ, నాన్న ప్రోత్సాహంతో కరాటే అభ్యసించడం మొదలు పెట్టిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు ఏ విషయంౖపైనెనా నేను నిర్భయంగా మాట్లాడుగలుగుతున్నా. అన్ని స్కూళ్లలోనూ కరాటే మాస్టర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తే ఈవ్ టీజింగ్ లాంటివి అరికట్టవచ్చు. కరాటే సాధన ద్వారా నాలో ఏకాగ్రత పెరిగింది. ఫలితంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 964 మార్కులు సాధించగలిగాను. కరాటేలోనే రాణించి క్రీడా కోటా కింద సివిల్స్‌కు ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. – నిఖితాబాయి, కదిరి