కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ | - | Sakshi
Sakshi News home page

కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ

May 7 2025 12:52 AM | Updated on May 7 2025 12:52 AM

కరాటే

కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ

కదిరి టౌన్‌: సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తమ పిల్లలను చదువుల కోసం బయటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే బాలికలకు చదువు ఒక్కటే సరిపోదు... అపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు అసవరమైన యుద్ద కళనూ అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే కదిరి ప్రాంతానికి చెందిన పలువురు బాలికలు కరాటే అభ్యసించి, రాష్ట్ర స్థాయిలో అవార్డులతో మెరిశారు.

ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతూ..

కదిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో విద్యార్థులకు ప్రత్యేకంగా కరాటే శిక్షణను మాస్టర్‌ షెక్షావలి అందిస్తున్నారు. ఈ శిక్షణలో పలువురు విద్యార్థినులు రాణిస్తున్నారు. 2024లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో కదిరికి చెందిన నిఖిత, సిరి పాల్గొన్నారు. వెల్స్‌ అసోసియేషన్‌ తరఫున ఒంగోలు, పార్వతీపురంలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. తెలంగాణలో నిర్వహించిన సీఎం–కేసీఆర్‌ కప్‌, విశాఖపట్నంలో జరిగిన 4వ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ల్లో పాల్గొని బంగారు, వెండి పతకాలు దక్కించుకున్నారు. అలాగే ఫెన్సింగ్‌లోనూ రాష్ట్ర స్థాయి పోటీలో నిఖిత, సిరి పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ ఏడాది జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లోనూ పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ విశేష ప్రతిభను కనబరిచారు.

యుద్ధ క్రీడల్లో రాణిస్తున్న

కదిరి విద్యార్థినులు

కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ1
1/1

కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement