
నాణ్యమైన పరిష్కారం చూపాలి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని నిర్దేశించిన వ్యవధిలోగా చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌తో పాటు అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 236 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతుల స్థితిగతులను ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. కార్యక్రమలలో డీఆర్‌డీఎ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్ధకశాఖ జేడీ శుభదాస్, పట్టుపరిశ్రమల శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ఎల్‌డీఎం రమణకుమార్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఉద్యానశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఫిరోజ్ బేగం, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.