నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’

May 5 2025 8:58 AM | Updated on May 5 2025 8:58 AM

నేడు

నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’

ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ఎస్పీ కార్యాలయంలోనూ..

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఎస్పీ వి. రత్న ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలన్నారు.

16న జిల్లా పరిషత్‌

సర్వసభ్య సమావేశం

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్‌లో నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అధికారులు గైర్హాజరు కావొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని సూచించారు.

అక్రమాలు నిజమే

రెడ్డెప్పశెట్టికి నోటీస్‌ జారీ చేసిన

ఏపీఐఐసీ

చిలమత్తూరు: మండల పరిధిలోని కోడూరులో ఉన్న లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల్లో రియల్టర్‌ రెడ్డ్డప్పశెట్టి అక్రమంగా పాలీహౌస్‌, ఫారం పాండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఏపీఐఐసీ అధికారులు ధ్రువీకరించారు. ‘‘అక్రమాలు కోకొల్లలు’’ శీర్షికన ఏప్రిల్‌ 28న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఏపీఐఐసీ జెడ్‌ఎం సోనీ ఈ నెల 1న రెడ్డప్పశెట్టి ఎస్టేట్‌ను తనిఖీ చేశారు. ఈడీ అటాచ్‌మెంట్‌ భూముల్లో ఫారంపాండ్‌, ఒక గది, పాలీహౌస్‌, విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. కోడూరు పొలం సర్వే నంబర్‌ 679లో ఈడీ అటాచ్‌మెంట్‌ భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని జెడ్‌ఎం సోనీ తెలిపారు. హబ్‌ భూములకు రెడ్డప్పశెట్టి సబ్సిడీలు ఎలా పొందారో హార్టికల్చర్‌ వాళ్లే సమాధానం చెప్పాలన్నారు. లేపాక్షి హబ్‌ భూమిలో ఉన్న ఫారం పాండ్‌లోని మోటార్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏడు రోజుల్లోగా ఆక్రమణలు తొలగించాలని నోటీసులు జారీ చేశామన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు నివేదించినట్లు పేర్కొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’ 1
1/2

నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’

నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’ 2
2/2

నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement