
ఎంఎల్‌హెచ్‌పీల డిమాండ్లు నెరవేర్చాలి
పుట్టపర్తి అర్బన్: ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత ఐదు రోజులుగా డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారం ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓల సమస్యలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళతామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రవినాయక్, మాజీ కన్వీనర్ మాధవరెడ్డి, ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు లింగా రామమోహన్ తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి డిమాండ్