
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో పలువురికి చో
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి ఆ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో చోటు కల్పిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా నరేంద్ర రెడ్డి, జనరల్ సెక్రటరీగా రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు.
బాలికల భద్రతకు పటిష్ట చర్యలు
అనంతపురం సెంట్రల్: యుక్త వయస్సు బాలికల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఐసీడీఎస్ పీడీ నాగమణి తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు సెమినార్ హాల్‌లో ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్లు, యూనిసెఫ్ ప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడారు. యుక్త వయస్సు బాలికల సాధికారిత కోసం ప్రత్యేక క్యాలెండర్‌ను విడుదల చేస్తూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా చేపడుతున్న అంశాలను వివరించారు. బాల్య వివాహాలు నివారించడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో పలువురికి చో