
జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి
పుట్టపర్తి టౌన్: ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ చేతన్ సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి గణేష్ కూడలిలోని మైనార్టీ షాదీ మహల్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు. స్వయంగా ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. యోగా చేసే వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారని, యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లే ప్రభుత్వం కూడా యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21 వరకు జిల్లాలో యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 18, 19 తేదీల్లో యోగాసన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌తో పాటు యోగా గురువులు పాల్గొన్నారు.
యోగాతోనే ఒత్తిడి జయించడం
సాధ్యం: కలెక్టర్