క్వింటా చింతపండు రూ.20 వేలు
హిందూపురం అర్బన్: మార్కెట్‌లో చింతపండు ధర తగ్గింది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 770.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.16 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12,200, కనిష్టంగా రూ.5 వేలు, సరాసరిన రూ.8 వేల ప్రకారం ధర పలికింది.
90 శాతం సబ్సిడీతో
డ్రిప్ పరికరాలు
గోరంట్ల: అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లను అందిస్తామని జిల్లా మైక్రో ఇరిగేన్ పీడీ సుదర్శన్ పేర్కొన్నారు. గురువారం మండలంలో ఆయన పర్యటించారు. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందించిన డ్రిప్, స్ప్రింక్లర్లను పరిశీలించారు. కార్యక్రమంలో డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
హంద్రీనీవా కాలువకు
మళ్లీ గండి
సోమందేపల్లి: మండల కేంద్రంలోని హంద్రీనీవా కాలువకు గురువారం మరోసారి గండి పడింది. రెండు నెలల కాలంలో మూడుసార్లు కాలువ తెగిపోవడంపై అధికారులు , స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు కాలువలో నీరు వృథాగా పోయింది. అనంతరం తాత్కాలికంగా గండిని పూడ్చారు. ఎస్‌ఐ రమేష్‌బాబు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు.
యూరియా అమ్మకాలపై కేసు
హిందూపురం: నాణ్యత లేని యూరియా అమ్మకాలపై వ్యవసాయ అధికారులు కేసు నమోదు కావడంతో హిందూపురంలోని బృందావన్ ట్రేడర్స్, చిలమత్తూరులోని సాయికృప ట్రేడర్స్, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ కంపెనీలపై కోర్టు నుంచి సమాన్లు జారీ అయినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం ఐఎఫ్‌ఎఫ్‌సీఓ కంపెనీ సరఫరా చేసిన యురియాను హిందూపురంలోని బృందావన్ ట్రేడర్స్ నిర్వహకులు చిలమత్తూరులోని సాయికృప ట్రేడర్స్‌కు యూరియా సరఫరా చేసినట్లు సమాచారం. అప్పటి మండల వ్యవసాయ అధికారి చిలమత్తూరు సాయికృప ట్రేడర్స్‌లో తనిఖీలు చేసి యూరియా నమూనా తీసి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఆ యురియా నాణ్యత లేదని తేలడంతో వ్యవసాయాధికారులు వీరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు ఈనెల 22వ తేదీ అనంతపురం కోర్టులో హాజరు కావాలని నోటీసులు వచ్చినట్లు తెలిసింది.
క్వింటా చింతపండు రూ.20 వేలు
క్వింటా చింతపండు రూ.20 వేలు


