క్వింటా చింతపండు రూ.25 వేలు | - | Sakshi
Sakshi News home page

క్వింటా చింతపండు రూ.25 వేలు

Apr 15 2025 12:45 AM | Updated on Apr 15 2025 12:45 AM

క్విం

క్వింటా చింతపండు రూ.25 వేలు

హిందూపురం అర్బన్‌: చింతపండు ధరలు మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1024.20 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్‌ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.12 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ.4 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌కు నాణ్యమైన చింతపండు తీసుకువచ్చి అధిక ధర పొందాలని కార్యదర్శి రైతులకు సూచించారు.

హెచ్‌ఎం పదోన్నతుల

సీనియార్టీ జాబితా సిద్ధం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్‌లో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoananthapuramu.blogspot. com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు.

ఎస్పీని కలిసిన డీఎస్పీ

పుట్టపర్తి టౌన్‌: పెనుకొండ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నరసింగప్ప సోమవారం ఎస్పీ రత్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ సబ్‌ డివిజన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని డీఎస్పీకి ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మట్కా, పేకాటను పూర్తిగా అరికట్టాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.

క్వింటా చింతపండు రూ.25 వేలు 1
1/1

క్వింటా చింతపండు రూ.25 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement