కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అంటూ ఆశపెట్టిన చంద్రబాబు... ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి నారా లోకేశ్ అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదం. పథకాలు అమలు చేయకుండా.. అబద్ధాలు చెబుతూ పబ్బం గడిపితే ప్రజలే తిరగబడతారు. బెల్టు షాపుల ద్వారా దొడ్డిదారిన ఉపాధి పొందేందుకు టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తుండటం బాధాకరం. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి,
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే