
విశేష అలంకరణలో దర్శనమిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు
ఆత్మకూరు: పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. ముందుగా పంచామృతాభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీకమాసం నాల్గో ఆదివారం కావడంతో ఆలయంలో సామూహిక విష్ణుసహస్త్ర నామ పారాయణం జరిగింది. స్వామికి బంగారు కవచ సేవ, ఆకుపూజ, అర్చన మహా నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం చుట్టూ స్వామికి బంగారు కవచాన్ని ప్రదక్షిణలు చేయించారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున రాహుకేతు హోమాలు నిర్వహించారు. ఆలయం బయట పెద్ద ఎత్తున మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.