
హిందూపురం: ఎందరో ప్రముఖులకు రాజకీయంగా పునాది వేసి రాజకీయ చైతన్యానికి చిరునామాగా నిలిచిన హిందూపురం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వారిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిపింది. అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధి వివరించేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం హిందూపురం చేరనుంది. ప్రజలు కూడా బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ ఒకరినే నమ్ముకుని నట్టేట మునిగాం...ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడదామంటూ సమష్టిగా ముందుకు సాగుతున్నారు. బుధవారం జరగబోయే సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసేందుకు ఉర్రూతలూగుతున్నారు. సామాజిక చైతన్యంతో...సాధికార స్వరం వినిపించేందుకు సిద్ధమయ్యారు.
అంబేడ్కర్ సర్కిల్‌లో బహిరంగ సభ
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్.దీపిక ఆధ్వర్యంలో బుధవారం హిందూపురంలో సామాజిక సాధికార బస్సుయాత్ర సాగనుంది. తొలుత ఉదయం 11.30 గంటలకు సరిగమ ఫంక్షన్‌హాలులో మేధావుల సదస్సు జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్దకు బస్సుయాత్ర చేరుకోనుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగసభకు ముఖ్యఅతిథులుగా వైఎస్సా సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీ్త్ర, శిసు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీమంత్రి అనీల్‌కుమార్ యాదవ్, కర్నూలు ఎంపీ సంజీవయ్య, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దీపికతోపాటు ముఖ్యనాయకులు హాజరుకానున్నారు.
నేడు ‘పురం’లో సామాజిక సాధికార సదస్సు
హాజరుకానున్న పలువురు మంత్రులు,
ప్రజాప్రతినిధులు
ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన ప్రజలు