
వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది మూడు రోజుల క్రితం మా ఇంటి వద్దకే వచ్చి కంటి పరీక్షలు చేశారు. నేడు కళ్లద్దాలు ఇచ్చారు. ఇంత తక్కువ వ్యవధిలో కంటి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం ఉంది. గతంలో కంటి పరీక్షల కోసం అద్దాలకు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉచితంగానే అద్దాలు ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ చల్లగా ఉండాలి. మా లాంటి ముసలోళ్లకు ఇంటికే వచ్చి ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నారు. ఉచితంగా వైద్యం అందించి మందులు ఇస్తున్నారు.
– ఓబుళమ్మ, జగరాజుపల్లి
రక్త పరీక్ష చేసి మందులు ఇచ్చారు
నేను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో రూ.లక్షలు ఖర్చు చేసి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నా. థైరాయిడ్‌కూ మందులు వాడుతున్నా. అయినా ఇబ్బందిగా ఉండటంతో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో పరీక్ష చేయించుకున్నా. వైద్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ కింద రెఫరల్ ఆస్పత్రికి పంపుతామన్నారు. ప్రస్తుతం ఉచితంగానే రక్త పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంది వైద్యులు మావద్దకే రావడం ఎప్పుడూ చూడలేదు.
– లక్ష్మీదేవి, కప్పలబండ
సొంతబిడ్డలా చూసుకుంటున్నారు
గర్భం దాల్చినప్పటి నుంచి వైద్య ఆరోగ్య సిబ్బంది నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వచ్చి మందులు, మాత్రలు ఇచ్చి తగిన సూచనలు ఇచ్చి పోతున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో క్యాల్షియం, విటమిన్ మాత్రలు ఇచ్చారు.
– సుకన్య, గర్భిణి, జగరాజుపల్లి

