
టోర్నీని ప్రారంభిస్తున్న దృశ్యం
మడకశిర: పట్టణ సమీపంలో శనివారం విజిలెన్స్ అధికారులు గ్రానైట్ లారీని అదుపులోకి తీసుకున్నారు. మడకశిర ప్రాంతంలోని క్వారీల నుంచి గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని మడకశిర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జిల్లా రగ్బీ జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: కర్నూలు వేదికగా అక్టోబర్ 1, 2 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొనే జిల్లా అండర్ 18 బాలబాలికల జట్ల ఎంపిక ప్రక్రియ శనివారం హిందూపురంలోని పోలీస్ మైదానంలో చేపట్టారు. విశ్రాంత పీడీ ముస్తఫా కమల్ బాషా, పీఈటీ రూప, పీడీలు లక్ష్మి, సందీప్, ఉదయ్‌కుమార్ పర్యవేక్షించారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్‌రెడ్డి, యాసిన్ మాలిక్, రెఫరీ విష్ణువర్థన్, మాజీ అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న బాలికల జట్టులో లోహిత, జయశ్రీ, సాయి హనీషా, అర్చన, వీణ, ప్రియమణి, అర్తిక, రైచల్, చందన, గాయత్రి, చంద్రిక, గౌతమి ఉన్నారు. అలాగే బాలుర జట్టులో విజయ్, మారుతి, మనోజ్, హర్షవర్థన్, వర్షిత్, రాఘవేంద్ర, సూర్యనారాయణ, నందీష్, అభినయ్, సాయి కుమార్ నాయక్, సుందర్‌బాబు, ఎస్.అశోక్, హెచ్.అశోక్, మహేష్ చోటు దక్కించుకున్నారు.
ఏపీఎల్ మిక్స్‌డ్ జండర్
క్రికెట్ టోర్నీ ప్రారంభం
అనంతపురం: అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా శనివారం నుంచి ఏపీఎల్ క్రికెట్ మిక్స్‌డ్ జండర్ టోర్నీ ప్రారంభమైంది. అనంతపురం స్పోర్ట్స్ విలేజ్, గుత్తి, కళ్యాణదుర్గం, ధర్మవరం కేంద్రాల్లో మొత్తం 15 జట్లు పాల్గొన్నాయి. ప్రతి జట్టులోనూ ఐదుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉంటారు. బ్యాటింగ్ భాగస్వామ్యంలో ఓ అమ్మాయి, అబ్బాయి ఉంటారు. అమ్మాయిలు 10 ఓవర్లు, అబ్బాయిలు 10 ఓవర్లు విధిగా బౌలింగ్ చేస్తారు. తొలి రోజు రాప్తాడు, గుత్తి, తాడిపత్రి, నార్పల, గుట్లూరు, ధర్మవరం, కదిరి జట్లు విజయం సాధించాయి.


రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు