
హిందూపురం: స్థానిక మేళాపురం నివాసి ఇర్షాద్ (32) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం వన్‌టౌన్ సీఐ ఈరన్న తెలిపారు. కూలి పనులతో జీవనం సాగించే ఇర్షాద్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో సంసారాన్ని పట్టించుకోకుండా, జులాయిగా మారాడు. దీంతో అప్పులు అధికం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేఉకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి ఇర్షాద్ భార్య జమీనాభాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతుడికి ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హుండీ కానుకల లెక్కింపు
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి హుండీ కానుకల లెక్కింపును సోమవారం చేపట్టారు. రూ.16,95,130 ఆదాయం సమకూరినట్లు దేవదాయ శాఖ ఈఓ శోభ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ శివశంకర్‌రెడ్డి, సర్పంచ్ రమణకుమారి, ఎంపీటీసీ సభ్యుడు రాజారెడ్డి, కో–ఆప్షన్ సభ్యురాలు షాబీరా, గ్రామస్తులు లింగారెడ్డి, గోపాల్ తదితరులు పాలొన్నారు.

మృతుడు ఇర్షాద్