
జస్టిస్ వెంకట శేషసాయికి శ్రీవారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట శేషసాయి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, ప్రధాన అర్చకులు ఏవీ నరసింహాచార్యులు, ఏడీ పార్థసారథి చార్యులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను వివరించారు. అమ్మవార్ల ఆలయంలో పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, పోలీసులు, రెవెన్యూ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తిమ్మమ్మ మర్రిమాను సందర్శన
ఎన్‌పీకుంట: మండల పరిధిలోని గూటిబైలు గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మమర్రిమానును ఆదివారం హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకటశేషసాయి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. తిమ్మమాంబ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వారికి స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. తిమ్మమాంబ ఆలయంలో బాలవీరయ్య, తిమ్మమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మర్రిమాను విశిష్టతను, ఆలయ చరిత్రను టూరిజం గైడ్ మనోహర్, అనిల్‌రాయల్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాసరావు, సబ్‌జడ్జి వెంకటేశ్వరరావు, అడిషినల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ మీనాక్షిసుందరి, ప్రిన్సిపల్ జ్యుడీషియల్ జడ్జి ప్రతిమ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగాల లోకేశ్వరరెడ్డి, కదిరి డీఎస్పీ భవ్యకిషోర్, సీఐ మధు తదితరులున్నారు.
నేడు ‘పోలీసు స్పందన’
కొత్తచెరువు: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుంది. ప్రజలు ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించవచ్చు. వినతిపత్రంలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ పొందుపరచాలి.
న్యూస్‌రీల్