కేసుల పరిష్కారం న్యాయ పక్షంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారం న్యాయ పక్షంగా ఉండాలి

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

స్థానిక కోర్టుల్లో ఆకస్మిక పరిశీలన

ఆత్మకూరు: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతోపాటు, తీర్పులు న్యాయ పక్షంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్‌ చెప్పారు. పట్టణంలోని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శనివారం ఆకస్మిక పరిశీలన చేశారు. ఏడాది కాలంలో పరిష్కారమైన కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో న్యాయం చేయడంలో న్యాయాధికారులు, న్యాయవాదులు ముందుండాలని పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని ఆయన కోరగా, పలువురు న్యాయవాదులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి బి గాయత్రి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎల్‌ జగదీష్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కె వెంకట రమణమ్మ, కార్యవర్గ సభ్యులు బి రాధాకృష్ణ, న్యాయవాదులు కె మహదేవరెడ్డి, ఎల్‌వీ రమణయ్య, నందా ఓబులేసు, తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు, ఎస్‌కే నజీర్‌బాషా, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement