ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కొందరు హోటళ్లను మూసివేయగా.. మరికొందరు కట్టెలతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గృహ వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు లభ్యం కాకపోవడంతో కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్స్, నెల్లూరు


