● రూ.10 లక్షల కేటాయింపు
● కృతజ్ఞతలు తెలిపిన ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణికి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విన్నపించారు. ఆమె సానుకూలంగా స్పందించి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. దీనిపై ప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, విడవలూరు మండలంలోని చౌకిచర్ల గిరిజన కాలనీలో సిమెంట్ రోడ్డు పనుల నిమిత్తం రూ.3 లక్షలు, దంపూరు ఎస్సీ కాలనీలో సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 లక్షలను ఎంపీ కేటాయించారు. నిధుల కేటాయింపుంపై కోవూరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.


