గూడు చెదిరి.. గుండె పగిలి | - | Sakshi
Sakshi News home page

గూడు చెదిరి.. గుండె పగిలి

Mar 28 2026 7:16 AM | Updated on Mar 28 2026 7:16 AM

కోవూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయా ల్సింది పోయి, ఉన్న గూడును కూలగొడుతున్నారు కూటమి నేతలు. దశాబ్దాలుగా కాలనీల్లో తలదాచుకుంటున్న నిరుపేదలపై పచ్చమూక కక్షగట్టింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడు పంచాయతీ స్టౌ బీడీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. సుమారు 50 ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే నివాసముంటున్న తమను ఒక్క నిమిషంలో రోడ్డున పడేశారని మహిళలు బోరున విలపించారు. ‘మా సామాన్లు సర్దుకునే లోపు ఇళ్లను కూల్చేశారు. ఇప్పుడు మేం ఎక్కడికెళ్లాలి’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం ఊసు లేదు. పునరావాసం కల్పించే ఆలోచనే లేదని, కేవలం రాజకీయ కక్షతోనే ఇలా చేశారని వారు ధ్వజమెత్తారు.

రోడ్డున పడిన బాధితులు

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తిరిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. గెలిచిన తర్వాత కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చెప్పుకొందామని ఎమ్మెల్యే ఇంటికి నాలుగుసార్లు వెళ్లినా, ఆమె కనీసం కనిపించలేదని వాపోయారు. ప్రజల కష్టాలు వినే తీరిక లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తమకు ఇళ్ల స్థలాలిచ్చి ఆదుకుందని బాధితులు గుర్తు చేసుకున్నారు. ‘ప్రశాంతిరెడ్డి.. మా కడుపు కొట్టొద్దు. బతకడమే భారమైన మాకు అద్దె ఇళ్లలో ఉండే స్థోమత లేదు. ఒక్కసారి మా బతుకులు వచ్చి చూడండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్యాయంగా ఇళ్లను కూల్చిన చోటే బాధితులు ధర్నాకు దిగారు.

పేదలపై కక్ష సాధింపు

నోటీసులు ఇవ్వలేదు

పునరావాసం ఊసే లేదు

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీరుపై

బాధితుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement