జగనన్న పథకాలు నా కుటుంబ రాతను మార్చేసింది
నా పేరు నూతలపాటి లక్ష్మమ్మ. వరికుంటపాడు మండలం వేంపాడు. నేను వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ తద్వారా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. జగనన్న సీఎం అయిన తర్వాత ఆసరా, చేయూత, రైతు భరోసా పథకాల ద్వారా మొదటి ఏడాదే రూ.45 వేలు వచ్చింది. ఆ డబ్బుతోపాటు పొదుపు గ్రూపు ద్వారా వచ్చిన రూ.లక్షతో కలిపి రెండు పాడి గేదెలు కొనుగోలు చేశాను. అంతకుమందు ఉన్న మరో గేదెతో కలిపి నెలకు పాల విక్రయం ద్వారా రూ.25 వేలు వచ్చేది. మరో 4 గేదెలు కొనుగోలు చేశాను. ప్రస్తుతం ఈ గేదెల ద్వారా వచ్చిన ఆదాయంతో గతంలో తీర్చలేకపోయిన రూ.3 లక్ష లు అప్పులు ఏడాది తిరిగే సరికి తీర్చేశాను. జగనన్న సీఎం అయిన రెండేల్లోనే నా కుటుంబం రాత మారిపోయింది. ఇప్పుడు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పాడి మీద రాబడి పొందుతున్నాను. జగనన్న అందజేసి సంక్షేమ పథకాలు ద్వారా జరిగింది. ఇవీ లేకపోతే మా కుటుంబ పరిస్థితి అధ్వానంగా ఉండేది.


