టీసీఎస్‌లో రూ.పది లక్షల ప్యాకేజీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్య చదువుకుని, ఈ రోజు ప్రతిష్టాత్మకమైన టీసీఎస్‌లో రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందానంటూ ఆత్మకూరు మండలం రామస్వామిపల్లికి చెందిన వి. శ్రీకాంత్‌రెడ్డి చెప్పాడు. ‘మాది మధ్య తరగతి కుటుంబం. చాలీచాలని ఆదాయం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికి సరిపోయేది. పెద్ద చదువులు చదవాలన్నా ఆర్థిక స్థోమత సరిపోయేది కాదు. జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యానగర్ ఎన్‌బీకేఆర్ కాలేజీలో పట్టుదలతో బీటెక్ పూర్తి చేశాను. వెంటనే టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు మా ఊర్లో నా కుటుంబం నలుగురిలో గర్వంగా తలెత్తుకునే విధంగా చదువుకుని ఉద్యోగం సాధించానంటే అది జగనన్న వల్లే. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమిటో ఊహించడానికి భయమేస్తోంది. థాంక్యూ జగనన్న.


