జగనన్న పాలన నా కుటుంబానికి స్వర్ణయుగం
‘జగనన్న ఐదేళ్ల పాలన నా కుటుంబానికి స్వర్ణయుగమైంది. నాకున్న నాలుగెకరాల మాగాణిలో ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యానికి పుట్టి రూ.19 వేల నుంచి రూ.24 వేల వరకు ధరలు పలికాయి. గిట్టుబాటు ధరలు లభించడంతో నాకున్న రూ.5 లక్షల వ్యక్తిగత అప్పులను తీర్చుకోవడంతోపాటు, బ్యాంకులో తెచ్చుకున్న పంట రుణం రూ.2 లక్షలను చెల్లించుగలిగాను. ఆర్థికంగా నేను నిలదొక్కుకోగలిగాను. నా ఇద్దరు మగ పిల్లలను ఇంజినీరింగ్ చదివించగలిగాను. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. జగనన్న రుణం తీర్చుకోలేనిదని పొదలకూరు మండలం యర్రబల్లి గ్రామానికి చెందిన రైతు బత్తల అంజయ్య అమితానందం వ్యక్తం చేశారు.


