సంగం బ్యారేజ్‌పై ఆటో బోల్తా
గాయపడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం
ఘటనా స్థలంలో ఆటో
● డ్రైవర్‌కు గాయాలు
సంగం: మండలంలోని సంగం బ్యారేజ్‌పై పొదలకూరు వైపు వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కొడవలూరు మండలం రాజుపాళేనికి చెందిన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ఆటోలో సామగ్రి వేసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో బ్యారేజ్‌పై ఆటో బోల్తా పడింది. దీంతో వాహనంలోని సామగ్రి ధ్వంసమైంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఆటో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంగం బ్యారేజ్‌పై ఆటో బోల్తా


