చందన, సీఎంఆర్‌లో వీక్లీ డ్రా
నెల్లూరు(బృందావనం): క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా చందన, సీఎంఆర్ ఫెస్టివ్ వండర్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వీక్లీ డ్రా స్కూటీ విజేతగా వి.జితేంద్ర నిలిచారు. అతనికి హీరో ప్లెజర్ స్కూటీని కార్పొరేషన్ ఇన్‌చార్జి మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ గురువారం అందజేశారు. అలాగే డైలీ డ్రా విజేతలు 35 మందికి గ్రైండర్, పాన్‌సెట్, మిక్సీ, రైస్‌కుక్కర్, డిన్నర్ సెట్లను పంపిణీ చేశారు. డైలీ డ్రా తీసి విజేతలకు రూప్‌కుమార్ ప్రకటించారు. గ్రైండర్‌ను ఎ.నాగమణి, పాన్‌సెట్‌ను ఎం.భార్గవి, మిక్సీని ఎండీ ఇనాయతుల్లా, రైస్‌కుక్కర్‌ను కె.విద్యావతి, డిన్నర్‌సెట్‌ను జి.వెంకటేశ్వర్లు గెలుపొందారు. సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పండగల సందర్భంగా ఏడు వారాలపాటు వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి కూపన్స్ ఇచ్చి రోజూ 5 గృహోపకరణాలు, 7 స్కూటీలు, న్యూ ఇయర్‌కు మలేసియా ట్రిప్, సంక్రాంతికి టాటా టియాగో కారు అందజేస్తున్నామన్నా రు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, శైలేష్, మేనేజర్లు వాసు, కిశోర్ పాల్గొన్నారు.


