ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు, ప్రజా జీవనానికి భంగం కల్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం గంజాయి విక్రయ కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, జమీర్, కల్లూరుపల్లిలో జరిగిన ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో నిందితుడు అరవ పెంచలయ్యను పోలీసు అధికారులు నెల్లూరులోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు రోడ్డుపై నడిపించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, నిల్వలు, అక్రమ రవాణా, చీకటి కార్యకలాపాలపై సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సంతపేట, నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్లు వైవీ సోమయ్య, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
గరుడ వాహనంపై నృసింహుని చిద్విలాసం
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఉన్న పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం రాత్రి బంగారు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. స్వాతి నక్షత్రం కావడంతో మూలమూర్తిని చందనంతో అలంకరించారు. వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో శాంతి హోమం చేశారు. మధ్యాహ్నం అన్నదానం జరిగింది. రాత్రి బంగారు గరుడ వాహనంపై శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి క్షేత్రోత్సవం నిర్వహించారు. ఉభయకర్తలుగా పెంచల నరసింహప్రసాద్ నాయుడు, పద్మావతి వ్యవహరించారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసులురెడ్డి, ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలస్వామి, భక్తులు పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి
సైదాపురం: సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ ఉమ్మడి కార్యాచరణ కమిటీ కన్వీనర్ డీపీ పోలయ్య అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఆ మండలాలను నెల్లూరులోనే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఎస్‌కే గంగాధర్, ఎస్‌కే రఫీ, సభ్యులు పాల్గొన్నారు.
దూరం పెరిగింది.. ఎందుకో?
ఉదయగిరి: కావలి నుంచి సీతారామపురం వరకు జరుగుతున్న జాతీయ రహదారి రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో హైవేపై కొన్నిచోట్ల వివిధ ప్రాంతాల దూరం తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దుత్తలూరులోని ఫ్లై ఓవర్ కింద భాగంలో ఏర్పాటు చేసిన బోర్డులో దుత్తలూరు నుంచి వింజమూరు దూరం 25 కిలోమీటర్లుగా నమోదు చేశారు. కానీ వాస్తవ దూరం 20 కి.మీ. గతంలో రోడ్లు భవనాల శాఖ అఽధికారులు ఏర్పాటు చేసిన బోర్డులో కూడా 20 కి.మీ దూరంగా ఉంది. వాస్తవంగా బైక్‌లు, కార్లు ఇతర వాహనాల మీటరు రీడింగ్ చూసినా అంతే దూరం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 5 కి.మీ దూరం ఎందుకు పెంచారో అని వాహనచోదకులు చర్చించుకుంటున్నారు.
ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు
ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు
ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు
ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు


