ప్రసన్నను కలిసిన మావులూరు
నెల్లూరు రూరల్: వైఎసార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మావులూరు శ్రీనివాసులురెడ్డి.. మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని నెల్లూరులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏపీఎల్‌డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, నాయకులు అంగా ఫకీరయ్య పాల్గొన్నారు.
టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బీద రవిచంద్ర?
నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్‌కు వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఆయన స్థానంలో రవిచంద్రకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. గతంలో రవిచంద్రకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
పెంచలయ్య హత్య కేసులో మరొకరి అరెస్ట్
నెల్లూరు సిటీ: ప్రజా నాట్యమండలి కళాకారుడు, సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో మరో నిందితుడైన అరవ కామాక్షి సోదరుడు అరవ పెంచలయ్యను మంగళవారం నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
పూరిల్లు దగ్ధం
● రూ.2.50 లక్షల ఆస్తి నష్టం
తోటపల్లిగూడూరు: విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమై రూ.2.50 లక్షల ఆస్తి నష్టం జరిగిన ఘటన పాతపట్టపుపాళెంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. కోడూరు పంచాయతీ పాతపట్టపుపాళెం గ్రామానికి చెందిన కోడూరు శారదమ్మ కూలీ పనులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ జరిగి పూరింట్లో మంటలు చెలరేగాయి. కళ్ల ముందే జరిగిన ఘటనతో తేరుకున్న కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే పూరిల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో కొంత నగదు, ఇంటి సామగ్రితో కలిసి సుమారు రూ.2.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ శారదమ్మ కోరింది.
విజయవాడ వెళ్లిన కలెక్టర్
నెల్లూరు(దర్గామిట్ట): విజయవాడలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం వెళ్లారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ చర్చించనున్నారు.
డీఈఓ కార్యాలయానికి పిలుపు?
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని జనార్దనపురం పాఠశాల ఉపాధ్యాయుడు ఆవుల రాజు, ఎంఈఓ 2 మధుసూదన్‌ను విచారణ నిమిత్తం డీఈఓ కార్యాలయానికి పిలిచినట్లు సమాచారం. ఆదివారం పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన డీఈఓ బాలాజీరావు.. డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆదివారం ఆయన విచారణ చేసి నివేదికను డీఈఓకు పంపారు. ఈ క్రమంలో బుధవారం ఆ ఇద్దరిని విద్యాశాఖ కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిచినట్లు సమాచారం.
చేపల గుంతలపై జేడీ సమీక్ష
సంగం: సంగం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మత్స్యశాఖ జేడీ శాంతి చేపల గుంతలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అనుమతుల్లేకుండా వేసిన చేపల గుంతలను తొలగించాలని, అదేవిధంగా అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లానాయక్, ఎస్సై రాజేష్, విద్యుత్ శాఖ ఏఈ మన్మథరావు, మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రసన్నను కలిసిన మావులూరు
ప్రసన్నను కలిసిన మావులూరు


