గుర్తుతెలియని మహిళ మృతి
నెల్లూరు(క్రైమ్): గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన నెల్లూరులోని శెట్టిగుంటరోడ్డులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మృతురాలి వయసు 50 నుంచి 55 ఏళ్లలోపు ఉండొచ్చు. పసుపు, గులాబీ ఆకుపచ్చరంగు డిజైన్ చీర, లైట్ గ్రీన్ బ్లౌజ్ ధరించి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మూర్ఛ రావడంతో కూప్పకూలిందని స్థానికులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. 6/3 వార్డు వీఆర్వో పి.ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవాబుపేట పోలీసుస్టేషన్‌లో లేదా 94407 96306 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.


