4,170 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
పొదలకూరు: బొలెరో వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మండలంలోని నెల్లూరు మార్గంలో మరుపూరు వద్ద శుక్రవారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐ ఎస్‌కే సుభానీ కథనం మేరకు.. అధికారులకు అందిన సమాచారం మేరకు దాడులు చేశారు. 111 ప్లాస్టిక్ సంచుల్లో 4,170 కేజీల బియ్యం వెంకటగిరి నుంచి నెల్లూరుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యం విలువ రూ.2,02,245గా గుర్తించారు. బొలెరో యజమాని ఎ.సతీష్, డ్రైవర్ సాల్మన్‌పై కేసు నమోదు చేశారు. వాహనాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్లో అప్పగించారు. పొదలకూరు సీఎస్ డీటీ ఐ.రవి, వీఆర్వో రాజా పాల్గొన్నారు.


