కార్తీక మాసంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

కార్తీక మాసంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Oct 24 2025 2:34 AM | Updated on Oct 24 2025 2:34 AM

కార్తీక మాసంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు

కార్తీక మాసంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు

నెల్లూరు సిటీ: కార్తీక మాసం సందర్భంగా దైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నెల్లూరులోని ప్రధాన బస్టాండ్‌లో గురువారం అధికారులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌–1 జి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ ప్యాకేజీలో సూపర్‌ లగ్జరీ బస్సులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. యాగంటి, మహానంది, శ్రీశైలంకు ప్రధాన బస్టాండ్‌ నుంచి ఈనెల 25, 26, నవంబర్‌ 1, 2, 4, 7, 8, 9, 15, 16 తేదీల్లో రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్‌ ధర రూ.1,800 అని చెప్పారు. అరుణాచలానికి ఆయా తేదీల్లో రాత్రి 9:30 గంటలు బస్సు ప్రారంభవుతుందన్నారు. టికెట్‌ ధర రూ.1,200గా నిర్ణయించారన్నారు. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమేశ్వరరామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని భీమేశ్వరారామం, సామర్లకోటలోని కొమరారామం ప్రాంతాలకు ఆయా తేదీల్లో రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరుతుందున్నారు. ధర రూ.2,500 అని చెప్పారు. శ్రీశైలం దర్శనానికి ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్‌ 18వ తేదీ వరకు రోజు రాత్రి 8:30 నిమిషాలకు లగ్జరీ బస్సు నడుతున్నట్లు తెలిపారు. టికెట్‌ ధర రూ.670 అన్నారు. వివరాలకు 99592 25653, 0861 – 2323333, 94921 92238, 99592 25641 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement